ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

LAKSHA DEEPOTHSAVAM IN PRAKASAM DISTRICT: ఘనంగా కార్తీక పొంగళ్లు .. పెద్దఎత్తున హాజరైన మహిళలు!

KARTHIKA PONGALLU: ప్రకాశం జిల్లా చీరాల ముత్యాలపేట శ్రీ మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద కార్తీక పొంగళ్ల కార్యక్రమం ఘనంగా సాగింది. అమ్మవారి చెట్టుకు పట్టుచీర కట్టి, బంగారు ఆభరణాలతో అలంకరించి... కార్తీక దీపాలను వెలిగించారు.

karthika-pongallu-program-conducted-in-prakasham-district
ఘనంగా కార్తిక పొంగళ్లు కార్యక్రమం.. పెద్దఎత్తున హాజరైన మహిళలు!

By

Published : Nov 28, 2021, 11:41 AM IST

Updated : Nov 28, 2021, 12:07 PM IST

ఘనంగా కార్తిక పొంగళ్లు కార్యక్రమం.. పెద్దఎత్తున హాజరైన మహిళలు!

LAKSHA DEEPOTHSAVAM IN PRAKASAM DISTRICT: ప్రకాశం జిల్లా చీరాల ముత్యాలపేటలో శ్రీ మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద కార్తీక పొంగళ్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే మహిళలు ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి చెట్టుకు పట్టుచీర కట్టి, బంగారు ఆభరణాలతో అలంకరించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన లక్ష దీపోత్సవంలో పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఆకాశ దీపాలను వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమోగింది.

గతంలో ఇక్కడి ప్రజలు అంతుచిక్కని వ్యాధితో చనిపోయేవారని... అప్పటి నుంచి కార్తీక మాసం మూడో వారంలో మాడ్రోజుల పాటు మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు. భక్తి శ్రద్ధలతో అమ్మను పూజిస్తే.. అయురారోగ్యాలు సిద్దిస్తాయని భక్తుల ప్రగాడ విశ్వాసం.

ఇదీ చూడండి:KARTHIKA MASAM: శైవ క్షేత్రాల్లో కార్తీకమాస ప్రత్యేక పూజలు, దీపారాధనలు

Last Updated : Nov 28, 2021, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details