తెలంగాణ, కర్నాటక నుంచి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలానికి భారీగా మద్యం సరఫరా అయినట్లు సమాచారం మేరకు కామేపల్లి గ్రామంలో సోదాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన రాయపాటి బ్రహ్మయ్య ఇంట్లో వరిగడ్డి వాములో నిల్వవుంచిన 60 మద్యం సీసాలను అధికారులు గుర్తించారు. వాటిని మండలంలోని పలు గ్రామాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్న ప్రసన్నకుమార్, శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.
గడ్డివాములో పొరుగు రాష్ట్ర మద్యం... ముగ్గురి అఱెస్టు
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో బ్రహ్మయ్య ఇంట్లో వరిగడ్డి వాములో దాచి వుంచిన 60 కర్నాటక మద్యం సీసాలను ప్రత్యేక నిఘావిభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేయగా కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు.
karnatka liquor seized in prakasam dst 3 arrested
ఈ వ్యాపారంలో కీలక పాత్రధారి బొగ్గవరపు నరేష్ మాత్రం పరారీలో ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో మద్యం సీసాను కర్నాటకలో రూ. 400లకు కొనుగోలు చేసి సంతమాగులూరు మండలంలో రూ.1200లకు విక్రయిస్తున్నట్లు సీఐ తిరుపతయ్య తెలిపారు. నిఘావిభాగం ఆధ్వర్యంలో అక్రమఅక్రమ మద్యం రవాణాపై దృష్టి సారించి దాడులు చేస్తున్నట్లు తిరుపతయ్య తెలిపారు.
ఇదీ చూడండి