సొంతూళ్లకు పంపించాలని వలస కూలీలు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మెడికొండ్రు మండలం పాలడుగులో ఆందోళన చేశారు. కర్ణాటక రాయచూరు ప్రాంతం నుంచి వ్యవసాయ కూలి పనులు నిమిత్తం సుమారు 400 మంది ఇక్కడకు వచ్చారు. తాము లాక్డౌన్ కారణంగా ఇరుకు పోయామని... తక్షణమే తమను సోంతూళ్లకు పంపించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సొంతూళ్లకు పంపించేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కరుణాకర్, సీఐ అనందరవు హామీ ఇవ్వటంతో వలస కూలీలు వెనక్కి తగ్గారు.
పాలడుగులో వలస కూలీల ఆందోళన - guntur district latest news
సొంతూళ్లకు పంపాలని పాలడుగు బొడ్డురాయి సెంటర్ వద్ద వలస కూలీలు శుక్రవారం సాయంత్రం ఆందోళన చేశారు. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ ప్రాంతం నుంచి కూలి పనుల నిమిత్తం వచ్చిన సుమారు 400 మంది సొంతూళ్లకు పంపించాలని నిరసన తెలిపారు. తహసీల్దారు కరుణకుమార్, సీఐ ఆనందరావులు అక్కడకు చేరుకొని స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు తీసుకంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
స్వస్థలాలకు కర్ణాటక వలస కూలీలు ఆందోళన