Kanigiri Volunteers Online App Scam:అన్లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో భారీ ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. యాప్‌లో పెట్టుబడులు పెడితే నగదు తిరిగి వస్తుందనీ నమ్మి పెట్టుబడులు పెడితే.. యాప్ పని చేయకపోవటంతో పెట్టుబడులు పెట్టిన వారు లబోదిబోమంటున్నారు. అయితే ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు హస్తమున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాలంటీర్లను పావులుగా వాడుకుంటూ పెద్ద మొత్తంలో మోసానికి తెర తీసినట్లుగా విమర్శలు వస్తున్నాయి.
ఆశను ఆసరాగా తీసుకుని అక్రమార్కులు మోసాలకు తెర తీస్తున్నారు. ఆర్థిక అవసరాలకు రుణాలు ఇస్తామంటూ.. పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం వస్తుందని.. నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన షేక్ సుల్తాన్ అనే వ్యక్తి వార్డు వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. అయితే అతనికి ఓ రోజు టెలిగ్రామ్‌లో ఈడబ్లూటీ యాప్ పేరుతో లింక్ వచ్చింది. ఆ యాప్‌లో 1000 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే.. ఆదాయం వస్తుందని తెలిసి సభ్యత్వం తీసుకున్నాడు.
సంకల్ప సిద్ధి మార్ట్ యాప్ మోసాలు.. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు
మొదట్లో ఆదాయం బాగానే వస్తుండటంతో.. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేసే నలుగురు వ్యక్తుల్ని సభ్యులుగా చేర్పించాడు. ఆ నలుగురు వారి వద్దకు ఎమ్మెల్యే కార్యాలయంలో సేవల కోసం వచ్చే వారికి సూచించారు. ఇందులో 150 మంది వరకు వాలంటీర్లు.. ప్రజలు ఉన్నారు. ఇందులో చేరిన వాలంటీర్లు.. ఆదాయం వస్తుండటంతో కమీషన్‌కు కక్కుర్తిపడి పింఛన్ లబ్దిదారులను ఇందులో చేర్పించారు. 1000 రూపాయలతో సభ్యులుగా చేర్పించారు. నగదు వస్తుందనే ఆశతో పింఛన్ లబ్దిదారులు ఇందులో పెట్టుబడి పెట్టారు.
గత రెండు రోజులుగా యాప్ పనిచేయకపోవటంతో మోసపోయినట్లు బాధితులు గుర్తించారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై సుల్తాన్ స్పందించాడు. తనకు ఈ మోసానికి ఎలాంటి సంబంధం లేదని.. తనపై అసత్యలు ప్రచారం చేస్తున్నారంటూ వాపోయాడు. తనను ఓ డివైస్ కోనుగోలు చేయమని తనతో రూ.98వేలు కట్టించుకున్నారని వివరించాడు.
Kanigiri Volunteers Online App Scam: పెట్టుబడి పెడితే లాభాలంటూ.. పింఛన్ లబ్ధిదారులను మోసం చేసిన వాలంటీర్లు "వెయ్యి రూపాయల పెట్టుబడి పెట్టి ఇందులో చేరిన తర్వాత.. నాకు వచ్చే ఆదాయాన్ని చూసి నా మిత్రులు ఇందులో చేరారు. అంతేకానీ నేను ఎవర్ని ఇందులో చేరమని ఒత్తిడి తీసుకురాలేదు. నన్ను లక్ష రూపాయల విలువ చేసే డివైజ్‌ను అద్దెకు తీసుకోవాలని నాపై ఒత్తిడి తీసుకువచ్చారు. నేను 98వేలు కట్టి అద్దెకు తీసుకున్నాను. డివైజ్ తీసుకున్న రెండు రోజుల తర్వాత.. యాప్ పని చేయటం ఆగిపోయింది. నేనూ చాలా నష్టపోయాను." -సుల్తాన్, వార్డు వాలంటీర్, కనిగిరి
యాప్‌తో టోపి: రూ.800 కట్టి చేరండి! మరో ముగ్గురిని చేర్పించండి.. తరువాత..!