ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసీ డిపో, గ్యారేజీని నెల్లూరు ఆర్టీసీ రీజినల్ ఈడీ గోపీనాథ్ రెడ్డి తనిఖీ చేశారు. బస్సుల కండిషన్, సిబ్బంది పనితీరును పరిశీలించారు. కరోనా సమయంలో సుమారు 5 నెలలపాటు బస్సులు నిలిచిపోయినందున వాటి మరమ్మతులకు అవసరమైన పరికరాలను సమకూర్చనట్లు ఆయన తెలిపారు.
కనిగిరి ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఈడీ - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
కనిగిరి ఆర్టీసీ డిపో, గ్యారేజిని నెల్లూరు ఆర్టీసీ రిజినల్ ఈడీ గోపీనాథ్‌రెడ్డి తనిఖీ చేశారు. గత 5 నెలలుగా బస్సులు పూర్తిగా తిరగనందున బస్సుల కండిషన్, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు.
కనిగిరి ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఈడీ
టైర్ల గురించి తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఖర్చులు తగ్గించుకునే విధంగా రాష్ట్రంలోని అన్ని డిపోలలో 15 రోజులపాటు ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. కరోనా సమయంలో కూడా కనిగిరి ఆర్టీసీ సిబ్బంది తమ డిపో అభివృధ్దికి చాలా కృషి చేస్తున్నారని గోపినాథ్ వెల్లడించారు.
ఇదీ చదవండి