ప్రకాశం జిల్లా కనిగిరి నగరపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు... నగర పంచాయతీ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు చెప్పారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. సిబ్బందికి, పోటీ చేసిన అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. 13 వార్డుల ఓట్ల లెక్కింపునకు సంబంధించి 52 మంది సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. తగిన గుర్తింపు కార్డు లేనిదే లెక్కింపు కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో కవరేజ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
కనిగిరి నగర పంచాయతీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి - prakasham elections news
ప్రకాశం జిల్లా కనిగిరి నగరపంచాయతీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగర పంచాయతీ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు .. లెక్కింపు సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
![కనిగిరి నగర పంచాయతీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి commissioner](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10991840-964-10991840-1615627185424.jpg)
కనిగిరి నగర పంచాయతీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి