MPP Warning to Volunteers: ప్రకాశం జిల్లా కనిగిరి మండల పరిషత్ కార్యాలయలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో స్థానిక ఎంపీపీ దంతులూరి ప్రకాశం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి మండలంలోని 25 పంచాయతీలకు చెందిన సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు హాజరయ్యారు. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకే ఓట్లు వేసే విధంగా ప్రతి ఒక్క వాలంటీరు తమకు సహకరించాలని.. అలా చేయకపోతే వాలంటీర్ పోస్ట్ నుంచి తొలగించేందుకు తనకు పూర్తి హక్కులు ఉన్నాయని హెచ్చరించారు. రాబోయే బడ్జెట్ సమావేశాలలో వాలంటీర్లకు వేతనం పెంచే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు దంతులూరి ప్రకాశం ఆశ కల్పించారు.
వైసీపీకి సహకరించకపోతే.. వాలంటీర్లను తొలగిస్తాం: ఎంపీపీ దంతులూరి ప్రకాశం - వాలంటీర్లకు హెచ్చరిక
MPP Warning to Volunteers: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసే విధంగా వాలంటీర్లు సహకరించాలని.. లేకుంటే వారిని తొలగిస్తానని ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎంపీపీ దంతులూరి ప్రకాశం హెచ్చరించారు. ఈ సమావేశంలో మండలంలోని 25 పంచాయతీలకు చెందిన.. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
![వైసీపీకి సహకరించకపోతే.. వాలంటీర్లను తొలగిస్తాం: ఎంపీపీ దంతులూరి ప్రకాశం MPP Warning to Volunteers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17551180-792-17551180-1674381814086.jpg)
వాలంటీర్లకు హెచ్చరిక
"గతంలో ఉన్న ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా వాలంటీర్లను నియమించి.. జీతాలు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇచ్చారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సహకరించాలి.. లేకుంటే నాకు వాలంటీర్లను తొలగించే హక్కు ఉంది. రాబోయే బడ్జెట్ సమావేశాలలో వాలంటీర్ల వేతనం కూడా పెంచే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని సమాచారం". - దంతులూరి ప్రకాశం, ఎంపీపీ, కనిగిరి
వాలంటీర్లను హెచ్చరించిన ఎంపీపీ
ఇవీ చదవండి: