ప్రకాశం జిల్లా కురుచేడు మండలం కల్లూరు గ్రామం పచ్చని పంట పొలాలు.. పచ్చదనంతో శోభిల్లుతోంది. ఎటుచూసినా పచ్చని వరి పైర్లతో ఎంతో చూడ ముచ్చటగా ఉంది. పచ్చని పైర్లను చూసి.. గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లగా వర్షాలు లేక... గుండ్లకమ్మ, సాగర్ కాల్వలకు నీళ్లు రాక.. చాలా ఇబ్బందులు పడ్డామని రైతులు అంటున్నారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు పడడం వలన సాగర్ కాల్వకి నీళ్లు వచ్చాయని, ఆ నీటితో తమ ఊరి చెరువు నిండిందన్నారు. నీరు పుష్కలంగా అందుబాటులో ఉండడం వలన.. పంటలు బాగా పండాయని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పల్లె పచ్చదనం... మనసుకు హాయిదనం - ప్రకాశం న్యూస్
పచ్చదానికి పల్లెలు పుట్టినిల్లు... పచ్చని పైర్లు, పారే సెలయేర్లు చూస్తే మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉరకలేస్తుంది. కానీ... మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఒక్కోసారి వర్షాలు తగ్గుతున్నాయి. పల్లె కళ తప్పుతోంది. అలాంటి పరిస్థితులను చూసింది ప్రకాశం జిల్లా కల్లూరు గ్రామం. ఏడాది క్రితం వరకు.. వర్షాలు లేక పొలాలు బీడుబారిన పరిస్థితి. ఈ సంవత్సరం ఆ పరిస్థితి కొంత మెరుగుపడింది. ఇటీవల కురిసిన వర్షాలకు పల్లె పచ్చదనాన్ని అద్దుకుంది. పచ్చని పట్టుచీర కట్టుకందా అనిపించేలా... కల్లూరు కనిపిస్తుంటే ఆహా.. ఏమీ నయనానందం అనక తప్పదు మరి...!
![పల్లె పచ్చదనం... మనసుకు హాయిదనం kalluru village in ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5402184-155-5402184-1576594442904.jpg)
పల్లె పచ్చదనం... మనసుకు హాయిదనం