ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కబడ్డీ క్రీడాకారిణి అఖిలకు వైకాపా ఆర్థిక సాయం - prakasam district latest news

రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన కబడ్డీ క్రీడాకారిణి గూడూరి అఖిలను ప్రకాశం జిల్లా వైకాపా నాయకులు సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు రూ. లక్ష చెక్కును అందజేశారు.

kabaddi player akhila gets one lakh rupees check
రూ. లక్ష చెక్కును అందజేస్తున్న ప్రకాశం జిల్లా వైకాపా నాయకులు

By

Published : Oct 18, 2020, 10:49 PM IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన కబడ్డీ క్రీడాకారిణి గూడూరు అఖిలను వైకాపా నాయకులు ప్రణీత్ రెడ్డి, పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్ ఛార్జి రావి రామనాధం బాబు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు పరామర్శించారు. చినగంజాం మండలం పెదగంజాంలో ఉన్న ఆమె స్వస్థలంలో కలిసి రూ. లక్ష చెక్కును అందజేశారు.

ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అఖిలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వైకాపా నాయకుడు బాలినేని ప్రణీత్​ రెడ్డి అన్నారు. ఆమె ప్రమాద విషయం ఇటీవలె మంత్రి దృష్టికి వచ్చిందని.. అఖిలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చేందుకే తనను ఇక్కడకు పంపించారని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details