దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ మంగళవారం బాధ్యతలు స్వీకరించడంతో ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మోదేపల్లి పులకించింది. ఈ కార్యక్రమాన్ని ప్రసార సాధనాల ద్వారా గ్రామస్థులు వీక్షించారు. న్యాయవర్గాల్లో మేధావిగా, పండితుడిగా ప్రత్యేక గుర్తింపు కలిగిన ఆయన తమ గ్రామానికి చెందినవారు కావటం ఆనందంగా ఉందని స్థానికులు తెలిపారు. జస్టిస్ శ్రీనరసింహ కుటుంబం హైదరాబాద్లో ఉంటున్నా.. జన్మభూమిపై మమకారాన్ని మరువలేదన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శ్రీనరసింహ బాధ్యతలు... స్వగ్రామంలో సంబురాలు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ బాధ్యతలు స్వీకరించడంతో ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా మోదేపల్లి పులకించింది. మేధావిగా, పండితుడిగా ప్రత్యేక గుర్తింపు కలిగిన ఆయన తమ గ్రామం వారు కావడం ఆనందంగా ఉందని స్థానికులు తెలిపారు. గ్రామంతో వారికున్న అనుబంధాన్ని స్థానికులు గుర్తు చేసుకున్నారు
జస్టిస్ శ్రీనరసింహ
మోదేపల్లిలో రామాలయం అభివృద్ధికి జస్టిస్ శ్రీనరసింహ రూ.1.50 లక్షల వరకు సాయమందించారని గ్రామస్థులు తెలిపారు. ఆరేళ్ల క్రితం జరిగిన ఉత్సవాలకు ఆయన స్వయంగా హాజరయ్యారని అన్నారు. జస్టిస్ శ్రీనరసింహ తండ్రి జస్టిస్ కోదండరామయ్య ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు.
ఇదీచదవండి