ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఐటిఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించారు. సీడాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాలో పదవతరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉపాధి అవకాశాలపై నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలనుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని దరఖాస్తులను అందజేశారు.
సీడాప్ ఆధ్వర్యంలో... జాబ్ మేళా - giddaloru
ప్రకాశం జిల్లా గిద్దలూరులో సీడాప్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని దరఖాస్తులు అందజేశారు.
జాబ్ మేళా