ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

VELUGONDA PROJECT: వెలకొండ ప్రాజెక్టు పనులపై జేసీ సమీక్ష - Jc venkata murali

ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పునరావాస పనులపై జేసీ కె.వెంకట మురళి సమీక్షించారు. పనుల పురోగతిపై ఆరా తీసిన ఆయన.. నిర్దేశించిన గడుపులోగా గుత్తేదారులు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం అధికారులు సమన్వయంతో యుద్ధప్రాతిపదికన మౌలిక సదుపాయాలు(Infrastructure) కల్పించాలన్నారు.

Evacuation of velugonda flood area people
వెలకొండ ప్రాజెక్టు పనులపై జేసీ సమీక్ష

By

Published : Jun 27, 2021, 5:36 PM IST

ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీలో యుద్ధప్రాతిపాదికన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు, గుండ్లకమ్మ రిజర్వాయర్‌, చిన్న పోలిరెడ్డి పథకాల అభివృద్ధి పనులు, భూసేకరణపై అధికారులతో సమావేశమైన సంయుక్త కలెక్టర్‌.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్టులో నీటిని నింపడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తొందని ఆయన తెలిపారు. అందువల్ల.. ఈ ప్రాజెక్టు కింద ఉన్న ముంపు గ్రామాల్లోని నిర్వాసితులను తరలించడానికి(Evacuation of velugonda flood area people) ఏర్పాట్లు చేయాలన్నారు.

పునరావాస కాలనీల్లో(Rehabilitation Colony) తాగునీటి సౌకర్యం, విద్యుత్, రహదారులు, మురికి కాల్వలు నిర్మాణం వంటి అన్ని సదుపాయాలు ఉండేలా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. అంగన్​వాడీ కేంద్రం, పాఠశాలలు, హాస్పిటల్, దేవాలయం, మసీదు, చర్చి, షాపింగ్ కాంప్లెక్స్, గ్రంథాలయం, పోస్టాఫీసు, బస్ షెల్టర్ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. పునరావాన కాలనీలకు అనుబంధంగా శ్మశాస వాటికకు భూమి కేటాయించాలని, భూమి లేని ప్రాంతాల్లో అందుకు అవసరమైన భూసేకరణ చేపట్టాలన్నారు. నిర్దేశించిన గడుపులోగా గుత్తేదారులు పనులు చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించి.. పురోగతిలేని పసులకు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఎత్తిపోతల పథకం క్రింద భూసేకరణ వేగంగా చేపట్టాలని, పాలేరు రిజర్వాయర్ కింద 103 ఎకరాల భూ సేకరణపై ఆరా తీశారు. ప్రాజెక్టు అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని అధికారులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details