ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్లో జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగింది. ఉదయం 7 గంటల నుంచి మార్కాపురం, పొదిలి, తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల్లోని అన్ని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించారు. బయటకు వచ్చిన వారికి పోలీసులు కరోనా పట్ల అవగాహన కల్పించి, ఇంట్లోనే ఉండాలని సూచించారు.
జనతా కర్ఫ్యూకు మార్కాపురం ప్రజల మద్దతు
ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్లోని గ్రామాల్లో కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా ఇళ్లల్లోనే ఉండి జనతా కర్ఫ్యూను పాటించారు.
ప్రకాశం జిల్లాలో స్తంభించిన జనజీవనం