ప్రకాశం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం చేస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. రహదారుల దుస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రహదారుల కోసం ఇస్తామన్న నిధుల కేటాయింపులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రైతులు, మహిళలు, యువతకు ఏం చేశారో చెప్పాలన్నారు. ప్రజల పక్షాన నిలబడేందుకు జనసేన ఎప్పుడూ సిద్ధమేనని.. సమస్యలపై నిజాయితీగా పోరాడే పార్టీ జనసేననే అని తెలిపారు. ప్రభుత్వం రైతులను ప్రణాళికాబద్ధంగా మోసం చేస్తోందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన కోసం సామాన్యలను ఇబ్బందులకు గురిచేస్తూ.. సభ ఏర్పాటు చేశారని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సభకు రావాలంటూ గ్రామ వాలంటీర్లతో బెదిరించి మహిళలను సమావేశానికి తీసుకువచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎంతో అధ్వానంగా తయారైందని విమర్శించారు. బద్వేల్ ఉప ఎన్నికలో భాజపా విజయం కోసం పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు.