నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సాయమందించాలని జనసేన పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పార్టీ ఇంఛార్జి గౌతంరాజు ఆధ్వర్యంలో కోలుకుల నుంచి మాచర్ల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ సాయం కింద రూ.పదివేలు..పూర్తి పరిహారం కింద ఎకరాకు రూ.35 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్‌కు అందజేశారు.
యర్రగొండపాలెంలో జనసేన నాయకుల నిరసన ర్యాలీ - janasena party latest news
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
జనసేన పార్టీ నాయకుల నిరసన ర్యాలీ