రాష్ట్రంలో దేవుళ్ల విగ్రహాల ధ్వంసంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని జనసేన కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ లక్షీనరసింహ స్వామి ఆలయ ఘటనపై పోస్టులు పెట్టారంటూ జనసేన కార్యకర్తలు తోటకూర అనిల్, నాగ మల్లికార్జున, దేవేంద్ర కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి కారకులను గుర్తించాల్సిన పోలీసులు.. ఆ బాధ్యతను పక్కనపెట్టి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని ఇబ్బందిపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
జనసేన కార్యకర్తలపై కేసులు ఉపసంహరించుకోవాలి: నాదెండ్ల మనోహర్
దేవుళ్ల విగ్రహాల ధ్వంసంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని జనసేన కార్యకర్తలను అరెస్టు చేయటంపై ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఆలయాలపై దాడుల కేసును రాజకీయం చేసేందుకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
సోషల్ మీడియాలో పోస్టింగ్స్‌పై కేసులు పెట్టి అరెస్టులు చేయాలంటే ముందుగా వైకాపా వాళ్లనే జైళ్లకు పంపించాల్సి ఉంటుందన్నారు. హైకోర్టు, న్యాయమూర్తులపై వారు చేసిన పోస్టింగులు అధికార పార్టీ ఆలోచనా విధానాన్ని తెలుపుతాయన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా ఇప్పటివరకూ పోలీసులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేయదని విమర్శించారు. దేవాలయాలపై దాడుల కేసును రాజకీయం చేసేందుకే జనసేన శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దీక్ష: దేవినేని