ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Granite Industries: గ్రానైట్ పరిశ్రమలకు ఇచ్చిన హామీలను జగన్ నిలబెట్టుకోవాలి - గ్రానై

గ్రానైట్ పరిశ్రమ యాజమాన్యాలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. గ్రానైట్ పరిశ్రమలకు పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ రెడ్డి నిలబెట్టుకోవాలని తేల్చి చెప్పారు.

Jagan should keep the promises given to the granite industries
గ్రానైట్ పరిశ్రమలకు ఇచ్చిన హామీలను జగన్ నిలబెట్టుకోవాలి

By

Published : Sep 3, 2021, 12:27 PM IST

వైకాపా నాయకుల అవినీతి, గ్రానైట్ అక్రమ రవాణా, నకిలీ వే బిల్లులతో ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు. గ్రానైట్ పరిశ్రమ యాజమాన్యాలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రానైట్ పరిశ్రమలకు పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ రెడ్డి నిలబెట్టుకోవాలని తేల్చి చెప్పారు. యూనిట్ విద్యుత్ ఛార్జీ రూ.3.75కు తగ్గించటంటంతో పాటు మైనింగ్ రాయల్టీ 55శాతం తగ్గింపు ఇవ్వాలన్నారు. 6నెలలు స్థిర విద్యుత్ ఛార్జీల మినహాయింపు ఇవ్వటంతో పాటు ప్రభుత్వ భూముల్ని పరిశ్రమల వ్యర్ధాలకు డంపింగ్ యార్డులుగా కేటాయించాలన్నారు.

చిన్న పరిశ్రమలకు రాయితీపై తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించాలని ఏలూరి స్పష్టం చేశారు. గ్రానైట్ అసోసియేషన్ ను మైనింగ్ పాలసీ రూపకల్పనలో భాగస్వామ్యం చేయాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:MSME FUNDS: పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు

ABOUT THE AUTHOR

...view details