ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధానిని కొనసాగించాలని కోరుతూ...ఒంగోలులో కాగడాల ప్రదర్శన - jac rally

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ...అమరావతి పరిరక్షణ సమితి, సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఒంగోలులో కాగడాల ప్రదర్శన నిర్వహించారు.

jac rally
ఒంగోలులో కాగడాల ప్రదర్శన

By

Published : Jan 6, 2020, 9:41 AM IST

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. ప్రకాశం జిల్లా ఒంగోలులో అమరావతి పరిరక్షణ సమితి, సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కిసాన్ రంగాభవన్ నుంచి చర్చి కూడలి వరకు జరిగిన ర్యాలీలో రాజకీయ, ఉపాధ్యాయ, న్యాయవాద, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చర్చి కూడలి వద్ద మానవహారం నిర్వహించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతి ముద్దు ...వైజాగ్ వద్దు అంటూ నినదించారు. హైకోర్టు తరలించవద్దని డిమాండ్ చేశారు. అంతకుముందు అన్ని సంఘాల నాయకులు ఆచార్య కిసాన్ రంగ భవన్ లో సమావేశం నిర్వహించి సంయుక్త కార్యాచరణ సమితి ఏర్పాటుచేసి అమరావతి రాజధానిగా కొనసాగించాలని తీర్మానించారు. జేఏసీ ఆధ్వర్యంలో అన్ని వర్గాలను ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ... ప్రతి రోజు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతామని జేఏసీ నాయకులు అన్నారు. భావి తరాల భవిష్యత్ కోసం అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని తెలిపారు.

ఒంగోలులో కాగడాల ప్రదర్శన

ABOUT THE AUTHOR

...view details