ఇదీ చూడండి:
'రాజధానిగా అమరావతి.. ఆంధ్రుల హక్కు' - కుందుర్రులో గ్రామస్థుల కొవ్వొత్తుల ర్యాలీ
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కుందుర్రు, మామిళ్లపల్లి గ్రామాల ప్రజలు.. అమరావతికి అనుకూలంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని....అమరావతి రాజధాని ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఒక రాజధాని ముద్దు...మూడు రాజధానులు వద్దు అంటూ కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. రాజధానిని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. అన్ని జిల్లాల ప్రజలు అమరావతికి మద్దతు తెలపాలని కోరారు.
కొవ్వొత్తులతో ర్యాలీ