ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ బాలికల ఐటీఐ సిబ్బందిని కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే వీడియో సమావేశంలో అభినందించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా మాస్కుల తయారీకి సాంకేతిక విద్యా శాఖ రాష్ట్ర సంచాలకురాలు బి.లావణ్యవేణి ఆదేశించారు. ఈ మేరకు మునియమ్మ టెక్స్‌టైల్స్ వారి సహకారంతో 14,350 మాస్కులను బాలికల ఐటీఐలో సిద్ధం చేశారు. వైద్యులు ఉపయోగించే పీపీఈ దుస్తులను కూడా కుట్టారు. ఇందుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. వీటిని జిల్లా సంయుక్త కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్‌కు అందజేశారు. సిబ్బంది అందరూ కలిసి పేదలకు నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. మాస్కుల తయారీకి కృషి చేసిన ప్రధానాచార్యులు పి.ఉమామహేశ్వరి, సుజాత, మల్లేష్‌లను కేంద్ర మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
శభాష్ ఐటీఐ.. కేంద్ర మంత్రి ప్రశంస - టెక్స్‌టైల్స్ వారి సహకారంతో 14,350 మాస్కులను బాలికల ఐటీఐలో సిద్ధం చేశారు
ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ బాలికల ఐటీఐ సిబ్బందితో కేంద్ర మంత్రి వీడియో సమావేశంలో పాల్గొన్నారు. 14,350 మాస్కులను సిద్ధం చేసి అందించినందుకు అభినందించారు.
వీడియో సమావేశంలో పాల్గొన్న ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది