ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయోధ్య రామ మందిర నిర్మాణానికి చీరాల వాసి భూరి విరాళం - అయోధ్యలో నిర్మించనున్న రాముడి గుడికి భారీ విరాళమిచ్చిన చీరాల వాసులు అర్వపల్లి కోటేశ్వరరావు దంపతులు

ప్రకాశం జిల్లా చీరాలలోని శ్రీలక్ష్మీశ్రీనివాస కాలనీకి చెందిన అర్వపల్లి కోటేశ్వరరావు దంపతులు.. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం రూ. 5,55,555 విరాళంగా ఇచ్చారు. స్థానిక శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీకి ఈ మేరకు చెక్కును​ అందజేశారు.

cheerala resident huge donation for ayodhya rama temple
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళమిస్తున్న అర్వపల్లి కోటేశ్వరరావు దంపతులు

By

Published : Jan 17, 2021, 10:21 PM IST

అయోధ్యలో నిర్మించనున్న రామ మందిర నిర్మాణానికి.. ప్రకాశం జిల్లా చీరాలలోని శ్రీ లక్ష్మీశ్రీనివాస కాలనీకి చెందిన విశ్రాంత ఐటీసీ మేనేజర్ అర్వపల్లి కోటేశ్వరరావు, సత్యవతి దంపతులు భారీ విరాళమిచ్చారు. రూ. 5,55,555 రూపాయల చెక్కు​ను.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర చీరాల కమిటీకి అందజేశారు. దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.

అర్వపల్లి కోటేశ్వరరావు దంపతులు విరాళమిచ్చిన చెక్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details