Massive Irregularities in Voter List:ప్రజాస్వామ్యంలో నేతల రాతలు మార్చేదీ.. ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే. అటువంటి ఓట్లతో ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో కొంతమంది అధికార పార్టీ నేతలు చెలగాటమాడుతున్నారు. బీఎల్వో(BLO)లపై ఒత్తిడి తెస్తూ.. ఓట్ల జాబితాలను ఇష్టారీతిన మార్చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒకే ఇంటి నంబరుపై పదుల్లో.. మరికొన్ని చోట్ల అసలు ఇంటి నంబరే లేకున్నప్పటికీ.. ఓట్లను చేర్చేశారు. వీటిని గుర్తించి తొలగించాల్సిన యంత్రాంగం చేతులు కట్టుకుని చోద్యం చూస్తోంది.
Daggubadu Sarpanch Video on Votes Cancellation: 'మేము చనిపోయాం సార్.. మా ఓట్లు తొలగించండి..!'
Multiple votes on the same household name:నిబంధనల ప్రకారం జాబితాలోని.. ప్రతి ఓటరుకు ఇంటి నంబరు ఉంటుంది. కనిగిరి పట్టణంలోని 1వ వార్డులో మాత్రం అసలు ఇంటి నంబరు దగ్గర నో అని పెట్టి ఏకంగా 2 వందల 80 మందికి ఓట్లు ఇచ్చేశారు. కనిగిరి పట్టణంలోని పోలింగ్ బూత్ 142 పరిధిలో కొండలరావు దుకాణం ఉంది. దీనికి ఇంటి నంబరు 4 వందల 98గా వేసి వందకు పైగా ఓట్లు చేర్చేశారు. ఇదే బూత్ పరిధిలోని ఇందిరాకాలనీ, బీసీ కాలనీ, రాజీవ్‌నగర్ కాలనీల్లోని ప్రాంతాల్లో మొత్తం 2 వందల 80కి పైగా ఓట్లకు ఎలాంటి ఇంటి నంబర్లు లేవు. కనిగిరి, పామూరు, శీలంవారిపల్లి, పెద అలవలపాడు ప్రాంతాల్లో 100, 141, 263, 228 బూత్ నంబర్లలో రెండు సున్నాలు డోరు నంబరుపై 40 ఓట్లు, డోర్ నంబరు 1-1 పేరుతో 50 ఓట్లు, నో అనే పేరుతో 150 ఓట్ల వరకు నమోదై ఉన్నాయి. ఇదే ప్రాంతంలో మూడు సున్నాలు డోర్ నంబరుతో 70 వరకు ఓట్లను నమోదు చేశారు. 1-00గా చూపుతూ 60 వరకు ఉన్నాయి.