ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Irctc North India Tour Plan: రేణిగుంట నుంచి రైలులో ఉత్తరభారత యాత్ర.. ప్యాకేజీ వివరాలివే..!

ఐఆర్​సీటీసీ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ పర్యాటక స్థానాలకు నడుపుతున్న ఉత్తర భారత యాత్ర ప్రత్యేక రైలు.. ఆగస్టు 27 నుంచి రేణిగుంట నుంచి ప్రారంభం కానునట్లు ఐఆర్​సీటీసీ సౌత్​జోన్ మేనేజర్ మురళి తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీలతో 11 రోజుల పాటు యాత్ర ఉంటుందని ఆయన వివరించారు.

ఉత్తర భారత యాత్ర రైలు
ఉత్తర భారత యాత్ర రైలు

By

Published : Jul 29, 2021, 1:10 PM IST

Updated : Jul 29, 2021, 1:27 PM IST

ఉత్తరభారత యాత్ర.. ప్యాకేజీ వివరాలివే..!

భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్​సీటీసీ ఆధ్వర్యంలో... దేశంలోని వివిధ పర్యాటక స్థానాలకు ఉత్తర భారత యాత్ర పేరిట స్పెషల్ రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా ఆగస్టు 27 నుంచి రేణిగుంట నుంచి ఉత్తర భారత యాత్ర ప్రత్యేక రైలు ఉంటుందని ఐఆర్​సీటీసీ సౌత్​జోన్ మేనేజర్ మురళి తెలిపారు. ఈ ట్రైన్ నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, ఖాజీపేట మీదుగా వెళ్తుందని వెల్లడించారు.

ఆగ్రా, మథుర, మాతా వైష్ణో దేవి, అమృత్​సర్, హరిద్వార్, దిల్లీ మీదుగా యాత్ర సాగుతుందని తెలిపారు. 11 రోజుల పాటు యాత్ర ఉంటుందని.. స్టాండ్ స్లీపర్ క్లాస్ ధర రూ.10,400, కంఫర్ట్ ఏసీ త్రీటైర్ రూ.17,330గా భారతీయ రైల్వే శాఖ నిర్ధారించిందని పేర్కొన్నారు. ఈ ప్యాకేజీలో టీ, కాఫీ, అల్పాహారం, భోజనం అందించనున్నట్లు చెప్పారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలతో ఈ యాత్ర చేపడుతున్నట్లు వివరించారు.

Last Updated : Jul 29, 2021, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details