ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య - ప్రకాశంలో విద్యార్థినుల ఆత్మహత్యలు

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ కారణంగా మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కె. తక్కెళ్లపాడులో జరిగింది.

inter student suicided
పరీక్షల్లో ఫెయిల్​ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని

By

Published : Jun 14, 2020, 10:36 AM IST

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని కె.తక్కెళ్లపాడులో లూథియా అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలై తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె... గ్రామ సమీపంలోని పోలాల్లో ఉన్న దిగుడు బావిలో బలవన్మరణానికి పాల్పడింది. బాలిక ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడం వల్ల... ఆమె తల్లి ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులతో కలిసి చుట్టుపక్కల వెతికింది. చివరకు దగ్గరలోని దిగుడు బావిలో కుమార్తె విగతజీవిగా ఉండటం చూసి తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై సోమశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details