ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Interstate gang of thieves arrested: జాతీయ రహదారులపై లారీలు, కంటైనర్లే వారి లక్ష్యం.. - crime news in ap

Interstate gang of thieves arrested: జాతీయ రహదారులపై ఆగివున్న లారీలు, కంటైనర్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను.. ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన నలుగురు వ్యక్తులు.. జాతీయ రహదారుల్లో కంటైనర్ల తాళాలు బద్దలుకొట్టి.. సరుకును చోరీ చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు.

Interstate gang of thieves arrested in prakasam
అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

By

Published : Feb 14, 2022, 7:40 PM IST

Interstate gang of thieves arrested: జాతీయ రహదారులపై ఆగివున్న లారీలు, కంటైనర్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను.. ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది ఆగస్టులో మార్టూరు మండలం ఇసుకదర్శి వద్ద ఆగివున్న కంటైనర్​లో రెడీమేడ్ దుస్తులను దొంగలించి పరారయ్యారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టారు.

చెన్నైకి చెందిన నలుగురు వ్యక్తులు.. జాతీయ రహదారుల్లో కంటైనర్ల తాళాలు బద్దలుకొట్టి.. సరుకును చోరీ చేస్తున్నట్లు తేల్చారు. దర్యాప్తు చేపట్టి వీరిని అరెస్టు చేసి ప్రశ్నించగా.. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇలాంటి దొంగతనాలు 10 చేసినట్లు నిందితులు అంగీకరించారు. సుమారు రూ.23 లక్షలు, లారీని స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details