ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పబ్జీ ఆడిన తరువాత గుండె ఆగిపోయింది! - pubg death in chenethapuri news

పబ్జీ గేమ్​ ఆడటం వలన మరో ప్రాణం గాల్లో కలిసిపోయింది. పబ్జీ ఆడటం వలన మానసిక ఒత్తిడికి గురవ్వటంతో గుండెపోటు వచ్చి ఇంటర్ విద్యార్థి కుప్పకూలాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చేనేతపురి గ్రామంలో జరిగింది.

inter student died after playing pubg game
పబ్జీ ఆడిన యువకుడు మృతి

By

Published : Aug 3, 2020, 5:48 PM IST

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చేనేతపురి గ్రామంలో విషాదం జరిగింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంగర మురళి అనే యువకుడు.. పబ్జీ ఆడిన అనంతరం గుండెపోటు వచ్చి మరణించాడు. పబ్జీ ఆడిన అనంతరం, మానసిక ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడని...మృతుడు తల్లి కన్నీరుమున్నీరవుతుంది.

సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ పోతుల సునీత.. సంఘటనా స్థలానికి చేరుకొని, మురళి మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడికి గురిచేస్తున్న పబ్జీ గేమ్​ను బ్యాన్ చేయాలన్నారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించేందుకు.. మంత్రి బాలినేని, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మృతుడు తల్లిని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పబ్జీ వంటి ఆన్​లైన్ గేమ్స్​ను తక్షణమే నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరారు. మురళి కుటుంబానికి తక్షణ సాయంగా 5 వేల రూపాయలను అందజేశారు.

ఇదీ చదవండి:బతికుండగానే శ్మశానానికి!

ABOUT THE AUTHOR

...view details