ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాల ఎక్సైజ్ అధికారుల వినూత్న ఆలోచన - చీరాలల్ లాక్​డౌన్ ప్రభావం

మద్యం దుకాణాల ముందు రద్దీని నియంత్రించేందుకు చీరాల ఎక్సైజ్ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. మద్యం అమ్మకాలకు ముందుగానే టోకెన్లు ఇచ్చి, అవి తెచ్చిన వారికే మద్యం విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. టోకెన్లు ఇస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న మద్యం ప్రియులు దుకాణాల ముందు బారులు తీరారు.

Innovative thinking of cheerala excise officers to sale tiquer
టోకెన్ల కోసం వేచి చూస్తున్న మద్యం ప్రియులు

By

Published : May 10, 2020, 6:46 PM IST

సోమవారం నుంచి ఒంగోలు, చీరాల, చీమకుర్తి, కందుకూరు, అద్దంకి, పర్చూరు, సింగరాయకొండ ప్రాంతాల పరిధిలోని 91 మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. చీరాల పట్టణం రెడ్​జోన్​లో ఉన్నందున రూరల్ ప్రాంతాల్లో దుకాణాలు తెరవాలని అధికారులు నిర్ణయించారు. మద్యం దుకాణాల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన ఎక్సైజ్ అధికారులు టోకెన్లు జారీ చేస్తున్నారు.

చీరాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9, పర్చూరు పరిధిలో 6 మద్యం దుకాణాల్లో విక్రయాలకు టోకెన్లు ఇస్తున్నారు. ఈ పరిణామంతో మద్యం ప్రియులు టోకెన్లు తీసుకోవడానికి దుకాణాల ముందు బారులు తీరారు. వీటి కోసం వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించాలని చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సి.ఐ రమేష్ ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details