ప్రకాశం జిల్లా గిద్దలూరులో లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్న వాహనదారులకు పోలీసులు వినూత్న శిక్ష విధించారు. వైఎస్సార్ సెంటర్ నుంచి కుమ్మరంకట్ట వరకు నడిపించారు. అనవసరంగా రోడ్లపైకి రాకూడదని ఆవగాహన కల్పించారు. మరోసారి బయటకు వస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
లాక్డౌన్ను ఉల్లంఘించిన వారికి వినూత్న శిక్ష - గిద్దలూరులో లాక్డౌన్ ప్రభావం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ప్రజలెవరూ బయటకు రాకూడదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొందరు అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు గుర్తించి వినూత్నంగా శిక్షలు విధిస్తున్నారు.
![లాక్డౌన్ను ఉల్లంఘించిన వారికి వినూత్న శిక్ష Innovative punishment for those impose a lockdown in giddalore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6993249-823-6993249-1588171572459.jpg)
లాక్డౌన్ను విధించిన వారికి వినూత్న శిక్ష