ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్లతో సాగర్ జలాల ఎత్తిపోత.. తాగునీటి చెరువులు నింపుతున్న అధికారులు

ప్రకాశం జిల్లా ఇంకొల్లు పంచాయతీ అధికారులు.. తాగునీటి చెరువులను నింపుతున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా.. నాగార్జున సాగర్ జలాలతో ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.

ఇంకొల్లు
ఇంకొల్లు

By

Published : May 6, 2021, 3:25 PM IST

ప్రకాశం జిల్లా ఇంకొల్లు పంచాయతీ అధికారులు.. తమ గ్రామ ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. నాగార్జున సాగర్ జలాలతో.. తాగునీటి చెరువులు నింపేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. మేజర్ పంచాయతీ అయిన ఇంకొల్లు పరిధిలో.. 2 తాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిపై ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాల ద్వారా.. ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

ఇందులో భాగంగా.. నాగుల చెరువును నింపేందుకు పర్చూరు రోడ్డులో ఉన్న పావులూరు మైనర్ కాలువపై.. మొత్తం 14 ట్రాక్టర్లు, ఇంజిన్లను ఏర్పాటు చేశారు. వీటితో నీటిని ఎత్తిపోసి చెరువులు నింపుతున్నారు. ప్రతి ఏటా ఇలా చేస్తుండడం ఇబ్బందిగా ఉందని.. ఆయా చెరువుల్లోకి నేరుగా పైప్ లైన్ ఏర్పాటు చేస్తే భారం తగ్గుతుందని స్థానికులు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details