ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం తురకపల్లి గ్రామంలో విషాదం జరిగింది. మద్యం మత్తులో భార్యపై భర్త గొడ్డలితో కొట్టి గాయపరిచాడు. బాధితురాలు గుంటూరులో జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. తురకపల్లి గ్రామానికి చెందిన కొండయ్య, బాలమ్మలు భర్యాభర్తలు. భర్త కొండయ్య మద్యానికి బానిసయ్యాడు. ప్రతి రోజూ మద్యం సేవించి వచ్చి బాలమ్మను అనుమానించేవాడు. వివాహేతర సంబంధం అంటగడుతూ వేధించేవాడు. ఈ క్రమంలో గత నాలుగు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కొండయ్య బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చి బాలమ్మతో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నిద్రపోయారు. తెల్లవారు జామున సుమారు మూడు గంటల సమయంలో కొండయ్య నిద్ర లేచి నిద్ర పోతున్న బాలమ్మను తలపైన గొడ్డలితో నరికాడు. ఆమెకు బలమైన రక్త గాయం అయింది. వెంటనే బాలమ్మ కేకలు వేసింది. ఆ శబ్దానికి ఆమె ఇద్దరు కుమార్తెలు లేచి చూసి గట్టిగా అరవటంతో గ్రామస్తులు వచ్చి బాలమ్మను మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని జీజీహెచ్‌కి తరలించారు. అక్కడ బాలమ్మ చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యానికి బానిసైన భర్త.. భార్యను గొడ్డలితో నరికి చంపాడు - husband murder on his wife at prakasam district thurakapalli
మద్యానికి బానిసైన భర్త కట్టుకున్న భార్యనే అత్యంత కిరాతంగా గొడ్డలితో నరికి చంపాడు . ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్దచర్లోపల్లి మండలంల తురకపల్లిలో జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మద్యానికి బానిసైన భర్త.. భార్యను గొడ్డలితో నరికాడు