ప్రకాశం జిల్లా, గిద్దలూరులో కురుస్తున్న భారీ వర్షానికి సగిలేరు, సీమ లేరు, కంభం మండలం ఎర్రబాలెం వద్ద గుండ్లకమ్మ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహించటంతో పలు గ్రామాల రాకపోకలు నిలచిపోయాయి. ఒక్కసారిగా వాగులకు వరద నీరు రావటంతో గిద్దలూరు ప్రజలు తాగు, సాగు నీటి సమస్య తీరుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి సమయానికి వర్షం కురవడంతో రైతులు కూడా పొలాల్లో విత్తనం వేసుకోవచ్చని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గిద్దలూరులో భారీ వర్షం.. పొంగుతున్న వాగులు, వంకలు
ప్రకాశం జిల్లా, గిద్దలూరులో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు పలు మండలాల్లోని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
గిద్దలూరులో భారీ వర్షాలు.. పొంగుతున్న వాగులు, వంకలు