ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంతపేటలో ఆకట్టుకున్న హైడ్రాలిక్ రోబోటిక్ మహా శివుడు - ఆకట్టుకున్న నగలోత్సవ కార్యక్రమం న్యూస్

ప్రకాశం జిల్లా సంతపేట శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలోని గంగా అన్నపూర్ణసమేత కాశీవిశాలాక్షీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో కేరళ నుంచి తీసుకొచ్చిన నాట్యం చేసే హైడ్రాలిక్ రోబోటిక్ మహా శివుడు విశేషంగా ఆకట్టుకుంది.

Impressive hydraulic robotic Lord Shiva at the Nagalotsava event held at Santapeta in Prakasam District
నగలోత్సవ కార్యక్రమంలో ఆకట్టుకున్న హైడ్రాలిక్ రోబోటిక్ మహా శివుడు

By

Published : Feb 25, 2021, 10:21 PM IST

నగలోత్సవ కార్యక్రమంలో ఆకట్టుకున్న హైడ్రాలిక్ రోబోటిక్ మహా శివుడు

మహా శివరాత్రి సందర్భంగా ప్రకాశం జిల్లా సంతపేట శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలోని గంగా అన్నపూర్ణసమేత కాశీవిశాలాక్షీ విశ్వేశ్వరస్వామి వారికి ఆలయ అర్చకులు యజ్ఞాన్ని నిర్వహించనున్నారు. 11 రోజులపాటు సాగే ఈ ఉత్సవాల్లో మహా ధన్వంతరీ, మహా మృత్యుంజయం, మహా చండీ యజ్ఞాలను జరపనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన కార్యక్రమానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. కేరళ నుంచి తీసుకొచ్చిన 24 అడుగుల నాట్యం చేసే హైడ్రాలిక్ రోబోటిక్ మహా శివుడు విశేషంగా ఆకట్టుకంది. దీన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు.

ఇదీ చదవండి:

అద్దంకి మండలంలో 10మంది వాలంటీర్ల తొలగింపు

ABOUT THE AUTHOR

...view details