ఎన్నికల నియమావళి మాకేమి వర్తించదులే అన్నట్లుగా ఉంది అధికారుల తీరు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ఎక్కడికక్కడే దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల వెలుపల నాయకుల ఫోటోలతో ఉన్న బోర్డులు, పార్టీ రంగులు అలాగే ఉండటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి .. రోడ్ల పక్కన ఉన్న ఫ్లెక్సీలు మొదలైన వాటిని తొలగించి ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
'ఎన్నికల నియమావళి కఠినంగా అమలు చేయాలి' - election code latest news
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినా అధికారులు మాత్రం ఆచరణ దిశగా అడుగులు వేయడం లేదు. ఇందుకు ఉదాహరణ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, ఫోటోలు తీసేయకుండా వదిలేయడమే.
అమలు కాని ఎన్నికల నియమావళి