ఆయుర్వేదంలో శస్త్ర చికిత్సలకు అవకాశం ఇస్తూ... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభ్యంతరం తెలిపింది. ప్రకాశం జిల్లాలో నిరసన చేశారు. అల్లోపతీలోనే శస్త్ర చికిత్సలకు అవకాశం ఉంటుందన్నారు.
ఆయుర్వేదంలో శస్త్ర చికిత్స సాధ్యం కాదని... కలుగూర గుంప వైద్యం వద్దని ఐఎమ్ఎ సభ్యులు పేర్కొంటున్నారు. అర్హత లేని వైద్యం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఒంగోలు సర్వజన ఆసుపత్రి ముందు ప్రైవేట్, ప్రభుత్వ వైద్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు.