ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనుమరుగవుతున్న కొండలు.. యథేచ్ఛగా తవ్వేస్తున్న అక్రమార్కులు - gravel mining in prakasham district

ప్రకాశంజిల్లా మార్టూరు మండలం కొలలపూడి, బొల్లాపల్లి, బొబ్బేపల్లి గ్రామాల్లో.. కొండలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన చేపట్టారు. అక్రమార్కులు యథేచ్ఛగా కొండలు తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో కొండలను తవ్వేస్తున్న అక్రమార్కులు
ప్రకాశం జిల్లా వార్తలు

By

Published : Nov 1, 2021, 6:28 PM IST

ప్రకాశంజిల్లా మార్టూరు మండలం కొలలపూడి, బొల్లాపల్లి, బొబ్బేపల్లి కొండలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన చేపట్టారు. అక్రమార్కులు యథేచ్ఛగా కొండలు తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 వందల ఎకరాల్లోని కొండలు ప్రస్తుతం సగానికి పైగా కనుమరుగయ్యాయని వెల్లడించారు.

ప్రతిరోజూ వెయ్యికి పైగా ట్రక్కుల మట్టి ఇక్కడి నుంచి తరలిస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. దీనివల్ల తమ పంట పొలాలు, రోడ్లు నాశనమవుతున్నాయని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి.. ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details