ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండపాలెం సమీపంలోని కొండను తవ్వి.. మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. అద్దంకి పట్టణ సమీపంలోని నాగులపాడు గ్రామంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల కోసం మట్టిని తరలించడానికి అధికారులు అనుమతిచ్చారు. దీనిని అదునుగా చేసుకున్న అక్రమార్కులు.. ఇతర ప్రాంతాలకూ మట్టిని తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి... మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
రెచ్చిపోతున్న అక్రమార్కులు... కొండనూ వదలడం లేదు...!
ప్రకాశం జిల్లా సింగరకొండపాలెంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను అడ్డం పెట్టుకుని అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కొండను తవ్వి మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
కొండను తవ్వి మట్టి తరలింపు