ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమతి పత్రాలు లేని రెండు ఇసుక లారీలు పట్టివేత - prakasam district latest news

ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నడుపుతున్న రెండు ఇసుక లారీలను ఎన్​ఫోర్స్​​మెంట్​ అధికారి పట్టుకున్నారు. ముండ్లమూరు మండలం పోలవరం నుంచి దొనకొండకు తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు.

illegal sand lorry caught by enforcement officer in prakasam district
ఇసుక లారీలను పట్టుకున్న ఎన్ఫోర్స్​మెంట్​ అధికారి

By

Published : Jun 19, 2020, 9:33 PM IST

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం నుంచి దొనకొండకు ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం వేకువజామున ఎన్​ఫోర్స్​మెంట్​​ అధికారి రాజేంద్రప్రసాద్​ ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. లారీలకు ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడం వల్ల వాటిని అదుపులోకి తీసుకుని డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details