ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏల్చూరులో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత - illegal liquor seized in yelchuru

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి మద్యం రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

illegal liquor
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు, వాహనం

By

Published : Nov 17, 2020, 12:40 PM IST

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో సినిమా హాలు సెంటర్ వద్ద మద్యం అక్రమ రవాణాదారులు పట్టుబడ్డారు. తెలంగాణ నుంచి భారీగా మద్యం సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1,008 క్వాటర్ బాటిల్స్, 24 ఫుల్ బాటిల్స్, మినీ లారీని స్వాధీనం చేసుకున్నారు.

నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి తెలంగాణ నుంచి మద్యం తీసుకువచ్చి ఏల్చూరులో అధిక ధరలకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. వీరిలో ముగ్గురిని అరెస్ట్​ చేయగా..ఒకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అద్దంకి సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ ప్రకాష్​రావు ఆధ్వర్యంలో నిందితులను మీడియా ముందు హాజరు పరిచారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్ప్సెక్టర్​, సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి ఎస్సైలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details