ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gutka seized: రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల దాడులు... మద్యం, గుట్కా ప్యాకెట్ల స్వాధీనం - prakasam district latest news

చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై.. పోలీసుల నిఘా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. మద్యం అక్రమ రవాణా, గుట్కా, నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

gutka seized
గుట్కాను స్వాధీనం

By

Published : Jun 16, 2021, 6:49 PM IST

Updated : Jun 16, 2021, 9:05 PM IST

రాష్ట్రంలోని పలు జిల్లాలో అక్రమంగా మద్యం, గుట్కా రవాణా చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకుని.. పలువురిని అరెస్టు చేశారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విశాఖ జిల్లా

విశాఖలో కంచరపాలెం పరిధిలోని ఏఎస్ఆర్ నగర్​లో పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.పది లక్షలు విలువ చేసే గుట్కా, ఖైని ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని... ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెహ్రు బజార్​లోని ఓ హోటల్ గదిలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.8 లక్షలు విలువ చేసే గుట్కా, మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని... ఒకరిని అరెస్టు చేశారు.యర్రగొండపాలెంలో రూ.3 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లు, 48 మద్యం బాటిళ్లను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేశారు.

కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లా ఆదోనిలో నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న 3000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కృష్ణా జిల్లా

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 46 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని...ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా లారీలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి.. 961.200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేశారు. పట్టుబడ్డ గంజాయి రూ.60 లక్షలు విలువ ఉంటుందన్నారు.

ఇదీ చదవండి

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు.. రూ. 5 లక్షల 30వేల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం

Last Updated : Jun 16, 2021, 9:05 PM IST

ABOUT THE AUTHOR

...view details