ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారిన అద్దంకి

ప్రకాశం జిల్లా అద్దంకి అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారుతోంది. గంజాయి, గుట్కా, నకిలీ మందులు ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో. జిల్లాలో ఎక్కడ ఏ నేరం జరిగినా దానికి మూలం ఇక్కడే ఉంటోంది. నేరగాళ్లకు నిలయంగా... అక్రమాలకు అడ్డాగా మారడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

illegal business heavy in adanki prakadam dst
అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారిన అద్దంకి

By

Published : Jan 12, 2020, 9:41 PM IST

అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారిన అద్దంకి
గంజాయి అక్రమ రవాణాకు ప్రకాశం జిల్లా అద్దంకి కేరాఫ్​గా నిలిచింది. రాంనగర్​లో సంవత్సరం నుంచి వ్యాపారం జోరుగా సాగుతోంది. అప్పట్లో ఈటీవీ భారత్ కథనంతో పోలీసులు గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. సుమారు 120 కిలోలకు పైగా సరుకును స్వాధీనం చేసుకున్నారు. కొంతమేర వ్యాపారం తగ్గినప్పటికీ... మళ్లీ చిన్న చిన్న దుకాణాల్లో చాప కింద నీరులా ఇది పుంజుకుంటోంది.

గుట్కా తయారికీ మేదరమెట్ల

గుట్కా వ్యాపారానికీ అద్దంకిలో అక్రమార్కులు తెర లేపారు. మేదరమెట్ల కేంద్రంగా తయారుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడి నుంచే పలు రాష్ట్రాలు, జిల్లాలకు సరఫరా జరుగుతున్నట్లు నిర్ధరణకు వచ్చారు.

నకిలీ మద్యానికీ చిరునామా

అద్దంకి పట్టణంలో నకిలీ మద్యం సైతం తయారు చేస్తున్నారు. నకిలీ పురుగు మందుల తయారీకి సంబంధించిన రసాయనాల ఖాళీ డబ్బాల మూతలు, కంపెనీలకు సంబంధించిన లేబుల్స్ వంటివి ఎన్నో ఈ కేంద్రాల్లో అధికారులకు దొరికాయి. నకిలీ మద్యంతో ప్రజలను... నకిలీ పురుగు మందులతో రైతులను అక్రమ వ్యాపారులు పూర్తిగా మోసం చేస్తున్నారు.

కుంభకోణమేదైనా... మూలం ఇక్కడే

ప్రకాశం జిల్లాలో ఏ కుంభకోణం జరిగినా మూలం ఇక్కడే ఉండడం గమనార్హం. ఇవే కాకుండా రహదారి పక్కన మరెన్నో చీకటి వ్యాపారాలు జరుగుతున్నాయి. పోలీస్, ఇంటెలిజెన్స్ అధికారుల కళ్ళు గప్పి అక్రమార్కులు దర్జాగా దందా సాగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

పృథ్వీరాజ్‌పై ఎస్వీబీసీ ఉద్యోగుల ఆగ్రహం..తొలగించాలని డిమాండ్​

ABOUT THE AUTHOR

...view details