కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు వందల మంది విద్యార్థులు రోడ్డు పై బైఠాయించి వుయ్ వాంట్.. జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ధర్నా ఆపమని హెచ్చరించారు. రేపు సాయంత్రంలోపు నాలుగు ట్రిపుల్ ఐటీలలో ఉండే విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిందిగా ఆర్జీకేయూటీ కులపతి కేసీ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మిగతా తరగతులను ఆన్లైన్లోని చెప్తామని ప్రకటించారు.
ఓ వైపు విద్యార్థుల ధర్నా..మరోవైపు ఆర్జీకేయూటీ కులపతి ఆదేశాలు - ఇడుపులపాయ ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నిరసన
కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులు ధర్నా నిర్వహిస్తున్నారు. రెండో రోజు శనివారం రాత్రి వరకు కూడా ఈ ధర్నా కొనసాగింది. రోడ్డు పైన బైఠాయించి మొబైల్ ఫోన్ లైట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఇంటిికి వెళ్లి ఆన్లైన్ తరగతులు వినాలంటూ ఆర్జీకేయూటీ కులపతి కేసీ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ధర్నా