భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా భర్త సెల్ టవర్ ఎక్కిన ఘటన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జరిగింది. పట్టణంలోని ఎస్టీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. తాగిన మైకంలో అలిగాడు.
స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వెనుక ఉన్న సెల్ టవర్ ఎక్కి బెదిరించాడు. అరగంటకు పైగా టవర్ పైనే ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్సై ముక్కంటి... వెంకటేశ్వర్లుతో మాట్లాడి చాకచక్యంగా కిందకు దిగేలా చేశారు.