ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో 1,629 మద్యం సీసాలు, వాహనాలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట, మార్టూరు, కొనకలమిట్ల మండలం గొట్లగట్టు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్విహించారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో విస్తృత తనిఖీలు... భారీగా మద్యం పట్టివేత - ప్రకాశం జిల్లా నేటి వార్తలు
రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగటంతో అక్రమార్కులు నూతన విధానానికి తెరలేపారు. వివిధ ప్రాంతాల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలించి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో వివిధ ప్రాంతాలలో జరిగిన తనిఖీల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
![ప్రకాశం జిల్లాలో విస్తృత తనిఖీలు... భారీగా మద్యం పట్టివేత Huge wine seized in police inspections in prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8224725-1029-8224725-1596054146863.jpg)
భారీగా మద్యాన్ని పట్టుకున్న పోలీసులు
Last Updated : Jul 30, 2020, 9:20 AM IST