ప్రకాశం జిల్లా పర్చూరు పరిధిలో గురువారం కురిసిన అకాల వర్షం... మిరప రైతులకు నష్టం కలిగించింది. కళ్లాల్లోని మిర్చి వర్షానికి తడిసిపోయింది. అప్పటికప్పుడు పట్టలు కప్పే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా మిర్చి అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నామని, ఇప్పుడు వర్షం మరింత దెబ్బతీసిందని వాపోతున్నారు.
అకాల వర్షం.. మిర్చి రైతుకి నష్టం
అకాల వర్షం రైతు కంట కన్నీరు తెప్పిస్తుంది. లాక్‌డౌన్ ఇబ్బందులతో సతమతం అవుతున్న రైతన్నకు వర్షం కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. చేతికొచ్చిన పంట నీటిపాలయ్యిందని వాపోతున్నారు.
huge Damage to Mirchi farmers due to heavy rain at parchuru in prakasham district