తన నియోజకవర్గంలో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. చీరాల మండలంలో అర్హత ఉన్నవారికి ఇళ్లస్థల పట్టాలను పంపిణీ చేశారు. నియోజక అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు బేబిరాణి, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
'నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు' - ప్రకాశం జిల్లా వార్తలు
ప్రకాశం జిల్లా చీరాల మండలంలో పేదలకు ఇళ్లస్థల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. నియోజకవర్గంలో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతున్నామని పేర్కొన్నారు.
ఇళ్లస్థల పట్టాల పంపిణీ