ప్రకాశం జిల్లా కొమ్మలపాడు గ్రామంలో అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల గ్రామస్థులు ఆందోళన చేశారు. గ్రామంలో మొత్తం 61 ఇళ్ల స్థలాలకు అధికారులు ప్లాట్లు వేశారు. వీటిని గ్రామంలో పేదలకు ఇచ్చేందుకు లాటరీ పద్ధతి నిర్వహించారు. ముందుగా 43 పేర్లు తహసీల్దార్ ఖరారు చేశారు. కాని ఆఖరి జాబితాలో కొత్తగా 5 పేర్లు చేరాయి. ఆగ్రహం చెందిన గ్రామస్థులు... అనర్హులను జాబితాలో ఎందుకు చేర్చారో చెప్పాలంటూ వీఆర్వోను నిలదీశారు. మండల తహసీల్దార్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇళ్ల జాబితాలో అనర్హులను చేర్చారంటూ గ్రామస్థుల ఆందోళన - kommlapadu village latest news
ఇళ్ల స్థలాల ఇవ్వటంలో అవకతవకలు జరిగాయంటూ కొమ్మలపాడు గ్రామస్థులు ఆందోళన చేశారు. లాటరీ పద్ధతిని నిర్వహించి 43 మంది పేర్లను తహసీల్దార్ ఖరారు చేశారు. కాని ఆఖరి జాబితాలో కొత్తగా 5 పేర్లు చేర్చటంతో ఆగ్రహం చెంది.. విషయంపై ఎమ్మార్వోను నిలదీశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇళ్ల స్థలాల ఇవ్వటంలో అవకతవకలు
Last Updated : Jul 7, 2020, 12:36 PM IST