ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం...సింగరాయకొండ మండలంలో ఇళ్ల స్థలాలకు అధికారులు 3600 మందిని అర్హులుగా గుర్తించారు. వీటిని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా సింగరాయకొండలోపేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం భారీస్థాయిలో నిర్వహించారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, కలెక్టర్ పోలా భాస్కర్ పాల్గొని పట్టాలు పంపిణీ చేశారు. ఒక సింగరాయకొండలొనే 2వేల మందికి పట్టాలు ఇస్తున్నట్లు గొప్పగా చెప్పారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
అర్హుల కంటే అనర్హులకే అధికంగా ఈ ఇళ్ల పట్టాలు ఎక్కువగా అందుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల మండలం లోని శానంపూడిలో చేపట్టిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో సొంత ఇల్లు ఉన్న వారినీ అర్హులుగా ప్రకటించి పట్టాలు అందజేశారనే ఆరోపణలు వస్తున్నాయి.