ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అభివృద్ధిని చూడలేకే అసత్య ఆరోపణలు' - house documents distribution in prakasam district

రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వైకాపా నేతలు ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.

house-cite-documents-distribution-in-andhra-pradhesh
ఆంధ్రప్రదేశ్​లో పట్టాలు పంపిణీ

By

Published : Jan 5, 2021, 8:37 PM IST

గుంటూరు జిల్లాలో...

రాష్ట్రంలో పండగ వాతావరణం కొనసాగుతుంటే.. ప్రతిపక్ష నాయకులు అశాంతి వాతావరణాన్ని సృష్టిస్తున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు ఆరోపించారు. గత పుష్కరాల సమయంలో తెదేపా వందలాది దేవాలయాలను కూల్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ఆలయాల్లో విగ్రహాలను కూల్చి రాష్ట్రంలో మత ఘర్షణలు చేసేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. రేపల్లె పట్టణంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో మోపిదేవి పాల్గొన్నారు.

అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా... దుగ్గిరాల మండలంలో 1200మంది లబ్ధిదారులకు స్థానిక శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి 1200 బెలూన్​లు ఎగరవేశారు. నియోజకవర్గంలో ఆర్హులైన పేదలందరికీ ఇళ్లు, స్థలాలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. మరో నాలుగు రోజుల్లో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు.

చిత్తూరు జిల్లాలో...

ప్రభుత్వ పథకాలకు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చేందుకు వైకాపా ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. పెనుమూరు మండల కేంద్రంలో పేదలకు ఇంటిపట్టాల పంపిణీ చేసిన ఆయన... గతంలో ఏ పార్టీ చేయలేని విధంగా పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తున్నామని వెల్లడించారు.

ప్రకాశం జిల్లాలో...

ఇళ్లు లేని నిరుపేదలకు స్థలాలు, పట్టాలు పంపిణీతో సొంతింటి కల నెరవేరిందని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. చీరాల మండలం కావూరివారిపాలెంలో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

పామూరులో అర్హులైన పేదలకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం భూమి పూజ నిర్వహించారు. ప్రతి గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండి దేవాలయాలను కాపాడుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

కర్నూలు జిల్లాలో...

దేవతా విగ్రహాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాల్లో భాగంగా నగరంలోని చాణక్యపురి కాలనీ, కొత్తపేట కాలనీల్లో అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

ఇదీచదవండి.

మరిన్ని విద్యుత్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు

ABOUT THE AUTHOR

...view details