143 మంది విద్యార్థులకు ...ఒకటే మరుగుదొడ్డి - వసతి గృహంలో వసతులు లేక విద్యార్థులు అవస్థలు
వసతి గృహంలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 143 మంది విద్యార్థులకు ఒకే మరుగుదొడ్డి...అపరిశుభ్ర వాతావరణం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు విద్యార్థులు. శాశ్వత భవనమూ లేనందున అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ప్రకాశంజిల్లా కురిచేడులోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతుల లేమి విద్యార్ధులను వేధిస్తోంది. 143మంది విద్యార్ధులకు ఒకే మరుగుదొడ్డి ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు.అపరిశుభ్రమైన గదులు,వాతావరణం వల్ల అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈగలు మధ్యే భోజనం చేయాల్సి వస్తోందని...రోగాల బారిన పడితే కాలం చెల్లిన మందులు ఇస్తున్నారని వాపోతున్నారు.శాశ్వత భవనం లేనందున అద్దె ఇంట్లో వసతిగృహం నిర్వహిస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు.వాపోయారు.