ప్రకాశం జిల్లా దర్శి మండలం శేషంవారిపాలెం గ్రామానికి చెందిన ముచ్చు కోటేశ్వరరావు... కూలీ పనుల కోసం వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. వైద్యం కోసమని గ్రామంలోని ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నాడు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దర్శిలోని ఝాన్సీ హాస్పిటల్లో చేరాడు. డాక్టర్ కోటిరెడ్డి వైద్యం చేస్తుండగా కోటేశ్వరావు మృతి చెందాడు. వైద్యుని నిర్లక్ష్యం కారణంగా చనిపోయాడని బాధితుని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
వ్యక్తి మృతి... ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన - వ్యక్తి మృతి... ఆసుపత్రిలో ఎదుట బంధువుల ఆందోళన
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఝాన్సీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు.
వ్యక్తి మృతి... ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
TAGGED:
HOSPITAL_DEATH_ONG